Share News

5 కిలోమీటర్లు డోలీ మోత

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:34 AM

మండలంలోని మారుమూల లంగుపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణికి ఇబ్బందులు తప్పలేదు.

5 కిలోమీటర్లు డోలీ మోత
డోలీలో గర్భిణిని ఆస్పత్రికి తీసుకువెళుతున్న దృశ్యం

గర్భిణికి తప్పని అవస్థలు

అనంతగిరి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల లంగుపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణికి ఇబ్బందులు తప్పలేదు. ఆమెను ఐదు కిలోమీటర్ల మేర డోలీలో తరలించాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని మారుమూల లంగుపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామానికి చెందిన సిరగం చిన్నమ్మి నిండు గర్భిణి. బుధవారం ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆమె భర్త గంగునాయుడు గ్రామస్థుల సహాయంతో డోలీలో ఆస్పత్రికి తరలించాలని నిర్ణయించాడు. నేలపాలెం నుంచి లుంగుపర్తికి ఐదు కిలోమీటర్లు గెడ్డలు, కొండలు దాటుకుంటూ ఆస్పత్రికి తరలించారు. నేలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు జన్ని భీమన్నదొర, జర్ర నారాయణ, చంటిబాబు, తదితరులు కోరారు.

Updated Date - Sep 04 , 2025 | 12:34 AM