473 టన్నుల బియ్యం స్వాధీనం?
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:18 AM
ఛత్తీ్‌సగఢ్ నుంచి విదేశాలకు తరలించేందుకు పోర్టుకు తీసుకువచ్చిన 473 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకూ పోర్టు పరిధిలో గల పలు కంటెయినర్‌లను సోదా చేసి ఈ బియ్యాన్ని పట్టుకున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇవి పీడీఎస్ (పబ్లిక్ డిస్ర్టిబ్యూషన్ సిస్టమ్) రైస్‌గా అనుమానిస్తున్నారు. నమూనాలను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు.
పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు అందాల్సినవిగా అనుమానం
ఛత్తీ్‌సగఢ్ నుంచి విశాఖ పోర్టు ద్వారా
విదేశాలకు ఎగుమతి చేసేందుకు ప్లాన్
విలువ రూ.90.14 లక్షలు
విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఛత్తీ్‌సగఢ్ నుంచి విదేశాలకు తరలించేందుకు పోర్టుకు తీసుకువచ్చిన 473 టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకూ పోర్టు పరిధిలో గల పలు కంటెయినర్‌లను సోదా చేసి ఈ బియ్యాన్ని పట్టుకున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఇవి పీడీఎస్ (పబ్లిక్ డిస్ర్టిబ్యూషన్ సిస్టమ్) రైస్‌గా అనుమానిస్తున్నారు. నమూనాలను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం...ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు విశాఖ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు పౌర సరఫరాల శాఖను అప్రమత్తం చేశారు. బియ్యం నిల్వలు గుర్తించడానికి రెండు బృందాలను ఏర్పాటుచేశారు. చినములగాడలోని శ్రావణి షిప్పింగ్ సర్వీసెస్ గోదాములను మంగళవారం సాయంత్రం ఒక బృందం తనిఖీ చేయగా అదానీ ఎక్స్‌పోర్ట్సు సంస్థకు చెందిన 115 టన్నుల బియ్యం, మరొక లారీలో సింగ్‌పూర్ ఎంటర్‌ప్రైజ్‌సకు చెందిన 35 టన్నుల బియ్యం లభించాయి. మొత్తం 150 టన్నుల బియ్యం శాంపిల్స్‌ను సేకరించి లేబొరేటరీకి పంపారు. మరో బృందం బుధవారం షీలానగర్ సమీపాన గల మెస్సర్స్ గేట్‌వే ఈస్టిండియా ప్రైవేటు లిమిటెడ్ గోదామును తనిఖీ చేసి, నాగపూర్‌కు చెందిన ఎస్.శ్రీరామా ఫుడ్ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఆరు కంటెయినర్లలో నిల్వ చేసిన 156 టన్నుల బియ్యం పట్టుకుంది. వీటికి సంబంధించి నమూనాలు తీసుకుంది. అక్కడే లారీల్లో ఉన్న మరో 167 టన్నుల బియ్యం పట్టుకుని నమూనాలు సేకరించి లేబొరేటరీకి పంపారు. వీటి విలువ రూ.90.41 లక్షలుగా నిర్థారించారు. రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా నిత్యావసరాల చట్టం ప్రకారం 6-ఎ కింద కేసులు నమోదుచేస్తామని, ఇంకా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జేసీ హెచ్చరించారు.