Share News

అరకులోయలో 4.4 డిగ్రీలు

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:33 PM

మన్యంలో చలి తీవ్రత తగ్గలేదు. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. కొయ్యూరు మండలం మినహా మిగతా పది మండలాల్లో బుధవారం సైతం సింగిల్‌ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అరకులోయలో 4.4 డిగ్రీలు
పాడేరు మెయిన్‌రోడ్డులో బుధవారం ఉదయం పొగమంచు

కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

చలికి వణుకుతున్న జనం

పాడేరు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి తీవ్రత తగ్గలేదు. దీంతో ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. కొయ్యూరు మండలం మినహా మిగతా పది మండలాల్లో బుధవారం సైతం సింగిల్‌ డిజిట్‌లోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం పాడేరుతో సహా దాదాపుగా అన్ని మండలాల్లోనూ ఉదయం తొమ్మిది గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. చలి ప్రభావానికి జనం ఉన్ని దుస్తులు ధరిస్తూ, మంటలు కాగుతూ చలి నుంచి రక్షణ పొందుతున్నారు.

తగ్గుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు

మన్యంలో మంగళవారంతో పోలిస్తే కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం అరకులోయలో 4.4 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.7, జి.మాడుగులలో 4.8, ముంచంగిపుట్టులో 5.0, పాడేరులో 5.2, హుకుంపేటలో 5.6, పెదబయలులో 6.7, చింతపల్లిలో 6.9, కొయ్యూరులో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ముంచంగిపుట్టులో..

ముంచంగిపుట్టు: మండల పరిధిలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు దట్టంగా కమ్ముకుంది. సుజనకోట సమీపంలో మత్స్యగెడ్డ తీరాన రోజూ తెల్లవారుజామునే సూర్యుడు దర్శనమిచ్చే వాడు. కానీ బుధవారం ఉదయం 9 గంటలు దాటినా మంచు వీడకపోవడంతో మత్స్యగెడ్డ కనిపించలేదు. దట్టంగా పొగమంచు కప్పేసింది. వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:33 PM