42 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:41 PM
ఆటోలో తరలిస్తున్న 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
ఇద్దరి అరెస్టు
బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): ఆటోలో తరలిస్తున్న 42 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. మండలంలోని బంగారు మెట్ట - కశింకోట రోడ్డులో బుచ్చెయ్యపేట చెరకు కాటా వద్ద మంగళవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అటుగా వస్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో 42 కిలోల గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులు పాడేరు నుంచి కేరళకు గంజాయిని తరలిస్తున్నట్టు తెలిసింది. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.