400 లీటర్ల నాటుసారా ధ్వంసం
ABN , Publish Date - Jul 31 , 2025 | 11:46 PM
ఒడిశాలోని నందపూర్ బ్లాక్ ఓండ్రొగడ్డ గ్రామంలో నాటుసారా స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎక్సైజ్ పోలీసులు గురువారం సంయుక్తంగా దాడులు చేసి 400 లీటర్ల నాటుసారా, 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారని పాడేరు ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీవీఎస్‌ఎన్ ఆచారి తెలిపారు.
1400 లీటర్ల బెల్లం ఊట కూడా..
ఆంధ్ర, ఒడిశా ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు
పెదబయలు, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఒడిశాలోని నందపూర్ బ్లాక్ ఓండ్రొగడ్డ గ్రామంలో నాటుసారా స్థావరాలపై ఆంధ్ర, ఒడిశా ఎక్సైజ్ పోలీసులు గురువారం సంయుక్తంగా దాడులు చేసి 400 లీటర్ల నాటుసారా, 1400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారని పాడేరు ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టీవీవీఎస్‌ఎన్ ఆచారి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఒడిశాలోని శివారు గ్రామాల్లో నాటుసారా తయారై అల్లూరి జిల్లాలోని పలు మండలాలకు సరఫరా అవుతోందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నందపూర్ బ్లాక్ ఎక్సైజ్ ఎస్‌ఐ కుమార్‌నాయక్‌తో కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు చేశామన్నారు. ఏవోబీలోని శివారు గ్రామాలతో పాటు ఏజెన్సీలో ఎక్కడ నాటుసారా తయారు చేసినా ఉపేక్షించేది లేదన్నారు. ప్రజల సహకారంతోనే నాటుసారాను శాశ్వతంగా నిర్మూలించగలమని, అందుకు ప్రజలు సహకరించాలని, సారా తయారీ స్థావరాల ఆచూకీ పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ కె.రాజారావు, అనకాపల్లి సీఐ జగదీశ్వర్‌రావు, పాడువ ఏఎస్‌ఐ, పాడేరు ఎక్సైజ్ సిబ్బంది, ఒడిశా ఐఆర్‌బీ సిబ్బంది పాల్గొన్నారు.