పాడేరులో 39.0 డిగ్రీలు
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:54 PM
మన్యంలో ఎండలు మండుతున్నాయి. తెల్లవారుజామున కాస్త చల్లదనంగా ఉంటున్నప్పటికీ, మిగిలిన సమయంలో వేడి ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా పగటి వేళల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది.
మన్యంలో మండుతున్న ఎండలు
పాడేరు, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండలు మండుతున్నాయి. తెల్లవారుజామున కాస్త చల్లదనంగా ఉంటున్నప్పటికీ, మిగిలిన సమయంలో వేడి ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా పగటి వేళల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీలో ఆదివారం జిల్లా కేంద్రం పాడేరులో 39.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, కొయ్యూరులో 36.8, డుంబ్రిగుడ 36.2, పెదబయలులో 34.7, అరకులోయలో, ముంచంగిపుట్టులో 33.6, హుకుంపేటలో 33.4, చింతపల్లి, అనంతగిరిలో 33.0, జి.మాడుగులలో 32.8, జీకేవీధిలో 31.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జీకేవీధిలో భారీ వర్షం
గూడెంకొత్తవీధి: మండలంలో భారీ వర్షం కురిసింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు కుండపోత వర్షం పడింది. వర్షం వల్ల ప్రధాన రహదారులు వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు వర్షపు నీటితో నిండిపోయాయి. అలాగే చింతపల్లిలో సాయంత్రం నాలుగు గంటలకు చిరుజల్లుల వర్షం కురిసింది.