జిల్లాకు 39 స్వచ్చాంధ్ర అవార్డులు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:51 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో జిల్లాకు ఒక రాష్ట్ర, 38 జిల్లా స్థాయి అవార్డులు దక్కాయని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
డుంబ్రిగుడ మండలం కించుమండ
క్లాప్‌మిత్రకు రాష్ట స్థాయి పురస్కారం
వివిధ కేటగిరిల్లో మరో 38 జిల్లా స్థాయి అవార్డులు
6న పురస్కారాన్ని అందజేయనున్న
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి
పాడేరు/డుంబ్రిగుడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో జిల్లాకు ఒక రాష్ట్ర, 38 జిల్లా స్థాయి అవార్డులు దక్కాయని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న పారిశుధ్య పనులతో పాటు ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు అమలుతోనే ఈ అవార్డులు సాధ్యమయ్యయన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని అవార్డులను సొంతం చేసుకునేందుకు కృషి చేస్తామని కలెక్టర్ దినేశ్‌కుమార్ పేర్కొన్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని డుంబ్రిగుడ మండలం కించుమండలోని ఎ.మల్లేశ్వరరావు అనే క్లాప్ మిత్రకు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ అవార్డు దక్కింది. అలాగే జిల్లాలోని గ్రామ సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పలు స్వచ్ఛంద సంస్థలకు జిల్లా స్థాయిలోని 38 స్వచ్ఛాంద్ర అవార్డులను ప్రకటించారు. ఈనెల 6 తేదీన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా 38 జిల్లా స్థాయి అవార్డులను ప్రధానం చేస్తారు. అలాగే రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన మల్లేశ్వరరావు అదేరోజు విజయవాడలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా స్వచ్ఛాంధ్ర అవార్డును స్వీకరించనున్నారు. జిల్లాకు మొత్తం 39 స్వచ్ఛాంధ్ర అవార్డులు దక్కడంపై జిల్లా యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.