జిల్లాలో 39 మంది ఉత్తమ గురువులు
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:51 AM
జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 39 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అనకాపల్లి గుండాల జంక్షన్‌లో వున్న ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం, అవార్డుల బహూకరణ వుంటాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరవుతారని చెప్పారు.
నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారం
అనకాపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 39 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం అనకాపల్లి గుండాల జంక్షన్‌లో వున్న ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో కలెక్టర్ విజయకృష్ణన్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం, అవార్డుల బహూకరణ వుంటాయని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరవుతారని చెప్పారు.
స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో ఉత్తమ ఉపాధ్యాయులు..
డి.సంజీవ కుమార్ జడ్పీ హెచ్‌ఎస్ సోమలింగపురం, ఎలమంచిలి మండలం; ఎస్.సోమేశ్, జడ్పీ హెచ్‌ఎస్ తురువోలు, చీడికాడ మండలం; ఎస్.మురళీకృష్ణ, జడ్పీ హెచ్‌ఎస్, కె.కోటపాడు; పీవీజీఎన్ గంగాధర్, జడ్పీ హెచ్‌ఎస్, గౌరీపట్నం, చోడవరం మండలం; అలమండ వి.రామాచార్యులు, జడ్పీహెచ్‌ఎస్, ఎస్.రాయవరం; తిల్లపూడి వెంకటరమణ, జడ్పీహెచ్‌ఎస్, చోద్యం, గొలుగొండ మండలం; కె.వీరభద్రరావు, ఎంపీయూపీ స్కూల్, పి.బయ్యవరం, ఎలమంచిలి మండలం; సీహెచ్ నాగరత్నం, కేపీపురం, ఎలమంచిలి; రాళ్లపల్లి దేముడు, జడ్పీహెచ్‌ఎస్, చౌడువాడ, కె.కోటపాడు మండలం; డి.పెంటారావు, జడ్పీహెచ్‌ఎస్, నాతవరం; ఎలిశెట్టి రామారావు, డీపీఎన్ జడ్పీహెచ్‌ఎస్, కశింకోట; తెనాలి రవికుమార్, జడ్పీహెచ్‌ఎస్, గుంటపల్లి, పాయకరావుపేట మండలం; డి.రవి, జడ్పీహెచ్‌ఎస్, మాకవరపాలెం; సీహెచ్ సత్తిబాబు, జడ్పీహెచ్‌ఎస్, బీబీ పట్నం, రోలుగుంట మండలం; ఎస్.సత్యారావు, జడ్పీ హెచ్‌ఎస్, గునుపూడి, నాతవరం మండలం; ఆర్‌వీవీ సత్యనారాయణ, ఎంపీఎస్, కొత్తకోట, రావికమతం మండలం; పి.అచ్చమ్మ, జడ్పీహెచ్‌ఎస్, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం టౌన్; టి.మాణిక్యం, జడ్పీహెచ్‌ఎస్, జోగంపేట, గొలుగొండ మండలం; డి.సుబ్రమణ్యేశ్వరరావు, జీహెచ్‌ఎస్, తానాం, పరవాడ మండలం; డి.కాళిదాస్, జడ్పీహెచ్‌ఎస్, కశింకోట.
ఎస్‌జీటీ విభాగంలో....
జీవీ రామన్న, ఎంపీపీఎస్, భీమవరం ఎస్.రాయవరం మండలం; చిలికళ్ల దేవి, ఎంపీయూపీఎస్, చెట్టుపాలెం, మాకవరపాలెం మండలం; డీఆర్‌కే శాస్ర్తి ఎంపీపీఎస్, దేవవరం, నక్కపల్లి మండలం; కె.సతీశ్, ఎంపీపీఎస్, డీఎల్ పురం-1, నక్కపల్లి మండలం; వి.శ్రీనివాసరావు, ఎంపీపీఎస్, గొల్లలపాలెం, కె.కోటపాడు మండలం; బీవీహెచ్ చంద్రశేఖర్, ఎంపీపీఎస్, వెలంకాయలపాలెం, రోలుగుంట మండలం; బొడ్డు అప్పలనాయుడు, ఎంపీపీఎస్, చౌడువాడ, కె.కోటపాడు మండలం; కె.బంగారయ్య, ఎంపీపీఎస్, పిండ్రంగి, కె.కోటపాడు మండలం; ఎన్.రామ, ఎంపీపీఎస్, ఎన్‌సీడీఎం, వడ్డాది, బుచ్చెయ్యపేట మండలం; ఇందాన అనిత, ఎంపీపీఎస్, బొడ్డువలస, సబ్బవరం మండలం; కె.దానిమ్మనాయుడు, ఎంపీపీఎస్, పాత వాలాబు, దేవరాపల్లి మండలం; కె.రాజేశ్, చినదొడ్డిగల్లు-2, నక్కపల్లి మండలం; కేఎన్ సుభాస్‌చంద్ర, ఎంపీయూపీఎస్, తామర్భ, దేవరాపల్లి మండలం.
ప్రధానోపాధ్యాయుల విభాగంలో....
ఎన్.శ్రీనివాసరావు, జడ్పీహెచ్‌ఎస్, వాడచీపురుపల్లి, పరవాడ మండలం; డి.వరహామూర్తి, జడ్పీహెచ్‌ఎస్, వరహాపురం, చీడికాడ మండలం; డీఎస్ భవాని, జడ్పీ జీహెచ్‌ఎస్, పాయకరావుపేట; కేవీ మాధవి, జడ్పీ జీహెచ్‌ఎస్, నర్సీపట్నం; ఆర్‌వీ జగదీశ్, జడ్పీ హెచ్‌ఎస్, నానిగిరపాడు, సబ్బవరం మండలం; పి.మల్లికార్జునరావు, జడ్పీహెచ్‌ఎస్, పీఎస్‌పేట, చోడవరం మండలం.