385 కిలోల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - May 13 , 2025 | 12:48 AM
మన్యం నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 385 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ (అనకాపల్లి) సుర్జిత్‌సింగ్ తెలిపారు.
ఒకరి అరెస్టు
పాడేరురూరల్, మే 12(ఆంధ్రజ్యోతి): మన్యం నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు సిద్ధం చేసిన 385 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేశామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ (అనకాపల్లి) సుర్జిత్‌సింగ్ తెలిపారు. పెదబయలు మండలం వనభంగి పంచాయతీ డుమ్మగూడ గ్రామానికి చెందిన కె.సత్తిబాబు మైదాన ప్రాంతానికి తరలించేందుకు గ్రామ సమీపంలోని పొదల్లో గంజాయిని నిల్వ చేసినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ జిల్లా బృందం, పాడేరు ఎక్సైజ్ స్టేషన్ సిబ్బందితో కలిసి సోమవారం తెల్లవారుజామున డుమ్మగూడ గ్రామంలో దాడులు నిర్వహించి పొదల్లో నిల్వ ఉంచిన 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి నిల్వ చేసిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన కె.సత్తిబాబుగా గుర్తించి అరెస్టు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో సీఐ జె.శ్రీనివాసరావు, ఎస్‌ఐలు పీవీ గిరి, బీసీహెచ్ వీర్రాజు, హిరణ్, హెచ్‌సీ ఎంఎస్ నాయుడు, సిబ్బంది బి.కిరణ్‌కుమార్, వి.సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.