Share News

362 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Apr 17 , 2025 | 10:48 PM

పాడేరు, పెదబయలు మండలాల సరిహద్దు గుత్తులపుట్టు ప్రాంతంలో బుధవారం 362 కిలోల గంజాయిని పట్టుకున్నామని, దానిని రవాణా చేస్తున్న జీపును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేశామని ఎక్సైజ్‌ సీఐ ఆచారి గురువారం విలేకరులకు తెలిపారు.

362 కిలోల గంజాయి పట్టివేత
పట్టుబడిన గంజాయి, జీపుతో ఎక్సైజ్‌ అధికారులు

ఒకరి అరెస్టు, జీపు స్వాధీనం

పాడేరు, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): పాడేరు, పెదబయలు మండలాల సరిహద్దు గుత్తులపుట్టు ప్రాంతంలో బుధవారం 362 కిలోల గంజాయిని పట్టుకున్నామని, దానిని రవాణా చేస్తున్న జీపును స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అరెస్టు చేశామని ఎక్సైజ్‌ సీఐ ఆచారి గురువారం విలేకరులకు తెలిపారు. దీనికి సంబంధించి ఆయన తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. పెదబయలు మండల పరిధి నుంచి ఓ జీపులో మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా జరుగుతోందని అందిన సమాచారం మేరకు పాడేరు మండలం గుత్తులపుట్టు వద్ద బుధవారం పెట్రోలింగ్‌ నిర్వహించారు. అటు నుంచి వేగంగా వస్తున్న జీపును ఆపి తనిఖీ చేశారు. ఈ క్రమంలో అందులో ఉన్న ఒక వ్యక్తి సిబ్బందిని చూసి పారిపోగా, డ్రైవర్‌తో సహా జీపును పట్టుకున్నారు. అందులో గంజాయి గుర్తించి లెక్కిస్తే 362 కిలోలు ఉంది. దీంతో డ్రైవర్‌ కిముడు దివాకర్‌ను అదుపులోకి విచారణ జరిపారు. జీపులోం,చి పరారైన వ్యక్తి అరడకోట గ్రామానికి చెందిన కిముడు అనిల్‌గా, గంజాయిని పెదబయలు మండలం బోగంపుట్టు గ్రామంలో అల్లంగి భగవాన్‌ వద్ద కొనుగోలు చేసి మైదాన ప్రాంతానికి రవాణా చేస్తున్నట్టు తెలుసుకున్నామని సీఐ తెలిపారు. దీంతో డ్రైవర్‌ దివాకర్‌ను అరెస్టు చేసి, జీపులో ఉన్న 362 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం దివాకర్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారన్నారు. గంజాయిని విక్రయించిన భగవాన్‌, రవాణాకు పాల్పడిన అనిల్‌ను పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని ఎక్సైజ్‌ సీఐ ఆచారి తెలిపారు.

Updated Date - Apr 17 , 2025 | 10:48 PM