350 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Aug 29 , 2025 | 11:24 PM
మండలంలోని బీరం పంచాయతీలో 350 కిలోల గంజాయితో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు.
ముగ్గురు అరెస్టు.. మరో ముగ్గురు పరారీ
రెండు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు సీజ్
జి.మాడుగుల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బీరం పంచాయతీలో 350 కిలోల గంజాయితో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు. శుక్రవారం భీరం పంచాయతీ అనర్భ గ్రామ శివారులో వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. బొలెరో వాహనాన్ని తనిఖీ చేశామన్నారు. అందులో 10 గోనె సండుల్లో 350 కిలోల గంజాయిని గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, రవాణాకు ఉయోగించిన బొలెరో వాహనంతో పాటు ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లను సీజ్ చేసినట్టు ఎస్‌ఐ షణ్ముఖరావు తెలిపారు. అలాగే మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.