30 టన్నుల రేషన్ బియ్యం సీజ్
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:59 PM
విజిలెన్స్ అధికారులు ఆదివారం మండలంలో ని ఎ.శరభవరం వద్ద దాడులు నిర్వహించి 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో విజిలెన్స్ ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో లారీని ఆపి తనిఖీ చేశారు. మొత్తం 608 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం పౌరసరఫరా డీటీకి అప్పగించారు. బియ్యానికి సంబంధించి నూకా నరసింహంపై కేసు నమోదు చేశారు.
నాతవరం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): విజిలెన్స్ అధికారులు ఆదివారం మండలంలో ని ఎ.శరభవరం వద్ద దాడులు నిర్వహించి 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో విజిలెన్స్ ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో లారీని ఆపి తనిఖీ చేశారు. మొత్తం 608 బస్తాల బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం పౌరసరఫరా డీటీకి అప్పగించారు. బియ్యానికి సంబంధించి నూకా నరసింహంపై కేసు నమోదు చేశారు.