నగరంలో 3 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు
ABN , Publish Date - May 06 , 2025 | 01:16 AM
పనిచేసే మహిళలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నగరంలో మూడు హాస్టళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ముడసర్లోవ, మధురవాడ, నరవల్లో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పీపీపీ విధానంలో నిర్మిస్తుంది. ఇందుకు సుమారు రూ.172 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.
రూ.172 కోట్లతో నిర్మాణం
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి):
పనిచేసే మహిళలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నగరంలో మూడు హాస్టళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని ముడసర్లోవ, మధురవాడ, నరవల్లో గ్రేటర్ విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ పీపీపీ విధానంలో నిర్మిస్తుంది. ఇందుకు సుమారు రూ.172 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ఈ హాస్టళ్లపై యాజమాన్య హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. హాస్టళ్ల ఆపరేషన్, భవనాల నిర్వహణ బాధ్యతలు పీపీపీలో అప్పగిస్తారు. భవన నిర్మాణాలకు కేపిటల్ ఇన్వెస్టిమెంట్ స్కీమ్ కింద సాయం చేయడానికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రాథమికంగా అంగీకరించింది. ముడసర్లోవలో రెండు ఎకరాల్లో రూ.90.54 కోట్లతో, మధురవాడలో 1.14 ఎకరాల్లో రూ.51.08 కోట్లతో, నరవలో రూ.30.40 కోట్లతో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు నిర్మాణం చేపడతారు.