29 మంది పోలీసులకు పదోన్నతి
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:33 PM
నగర పోలీస్ కమిషనరేట్‌లో పలు విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 29 మందికి పదోన్నతి కల్పిస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నగర పోలీస్ కమిషనరేట్‌లో పలు విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 29 మందికి పదోన్నతి కల్పిస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న 14 మందికి హెడ్ కానిస్టేబుళ్లుగా, హెచ్‌సీలుగా పనిచేస్తున్న 13 మందికి ఏఎస్‌ఐలుగా, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ సీపీ సత్కరించి, పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు.