26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:35 AM
పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టణంలోని ఒక రైస్‌మిల్లు వద్ద ఉంచిన సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. స్థానిక రైల్వే స్టేషన్‌రోడ్డు సమీపంలోని ఒక రైస్ మిల్లుకు శనివారం ఉదయం ఆటోలో రేషన్ బియ్యం బస్తాలు వెళుతుండడాన్ని జనసేన కార్యకర్తలు చూశారు. వారు వెంటనే ఈ విషయాన్ని రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో వున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.
ఎలమంచిలి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టణంలోని ఒక రైస్‌మిల్లు వద్ద ఉంచిన సుమారు రెండున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి. స్థానిక రైల్వే స్టేషన్‌రోడ్డు సమీపంలోని ఒక రైస్ మిల్లుకు శనివారం ఉదయం ఆటోలో రేషన్ బియ్యం బస్తాలు వెళుతుండడాన్ని జనసేన కార్యకర్తలు చూశారు. వారు వెంటనే ఈ విషయాన్ని రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో వున్న ఎమ్మెల్యే విజయ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ద్విచక్ర వాహనంపై మిల్లు వద్దకు వచ్చి వాకబు చేశారు. అనంతరం పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దారు రాజేంద్ర ప్రసాద్‌కు ఫోన్ చేయగా.. కొద్దిసేపట్లో ఆయన చేరుకున్నారు. బియ్యం గురించి రైస్ మిల్లు నిర్వాహకులను విచారించగా, ఎస్.రాయవరానికి చెందిన పి.సత్యనారాయణ అనే వ్యక్తి బియ్యాన్ని పాలిష్ పట్టించేందుకు మిల్లుకు తీసుకువచ్చాడని, అయితే పాలిష్ చేయబోమని తాము చెప్పడంతో తిరిగి తీసుకుపోయేందుకు వాహనం కోసం వెళ్లాడని చెప్పారు. దీంతో సుమారు 26 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని డీటీ స్వాధీనం చేసుకొని లైనుకొత్తూరులోని గోదాముకు తరలించారు. బియ్యం తీసుకువచ్చిన పి.సత్యనారాయణపై 6ఏ కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని పౌరసరఫరాలు, పోలీసు శాఖలను ఎమ్మెల్యే ఆదేశించారు.