24 వేల యాంటీ రేబిస్ టీకాలు సిద్ధం
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:46 PM
జిల్లాలో 80 పశు సంవర్థకశాఖ ఆస్పత్రుల్లో 24 వేల యాంటీ రేబిస్ టీకాలను అందుబాటులో ఉంచామని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహనరావు తెలిపారు.
జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహనరావు
అనకాపల్లి టౌన్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 80 పశు సంవర్థకశాఖ ఆస్పత్రుల్లో 24 వేల యాంటీ రేబిస్ టీకాలను అందుబాటులో ఉంచామని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహనరావు తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ఆదివారం స్థానిక గాంధీనగరం పశుసంవర్థకశాఖ కార్యాలయంలో 198 పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలను సిబ్బంది వేశారు. ఆర్డీవో షేక్ ఆయీషా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, సిబ్బంది పెంపుడు జంతువుల యజమానులకు వివిధ జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ బి.రామ్మోహనరావు మాట్లాడుతూ సంక్రమిత వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశుసంవర్థకశాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, పశుసంవర్థకశాఖ సిబ్బంది పాల్గొన్నారు.