Share News

230 బస్సులు రద్దు

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:00 AM

తుఫాన్‌ కారణంగా భారీవర్షాలు కురుస్తుండడంతో బుధవారం ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం జిల్లాలో 230 బస్సులు రద్దు చేసింది. ఘాట్‌రోడ్లతో పాటు వర్షాల కారణంగా బాగా రోడ్లు దెబ్బతిన్న రూట్‌లలో సర్వీస్‌లు నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సురక్షిత రూట్లలో మాత్రమే సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు జూమ్‌ మీటింగ్‌లో ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుణుపూరు, భద్రాచలం, సీలేరు, అరకులోయ,

230 బస్సులు రద్దు

ఘాట్‌రోడ్లు సహా పలు మార్గాల్లో సర్వీస్‌లు నిలిపివేత

మిగిలిన బస్సుల్లో ఆక్యుపెన్సీ 50 శాతమే...

ద్వారకా బస్‌స్టేషన్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి):

తుఫాన్‌ కారణంగా భారీవర్షాలు కురుస్తుండడంతో బుధవారం ఆర్టీసీ విశాఖ రీజియన్‌ యాజమాన్యం జిల్లాలో 230 బస్సులు రద్దు చేసింది. ఘాట్‌రోడ్లతో పాటు వర్షాల కారణంగా బాగా రోడ్లు దెబ్బతిన్న రూట్‌లలో సర్వీస్‌లు నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా సురక్షిత రూట్లలో మాత్రమే సేవలందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆర్టీసీ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ద్వారకా తిరుమలరావు జూమ్‌ మీటింగ్‌లో ఇచ్చిన ఆదేశాలను పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ విశాఖ రీజియన్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుణుపూరు, భద్రాచలం, సీలేరు, అరకులోయ, ఇంద్రావతి, పాడేరు రూట్లలో రాకపోకలు సాగించాల్సిన బస్సులను రద్దు చేసింది. అలాగే విశాఖ రీజియన్‌లో సింహాచలం కొండపైకి బస్సులను రద్దు చేసింది. రూట్లు బాగున్నప్పటికీ ప్రయాణికుల డిమాండ్‌ లేకపోవడంతో శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, విజయనగరం, బొబ్బిలి, సాలూరు, రాజాం ప్రాంతాలకు అనేక సర్వీస్‌లు రద్దు చేశారు. సిటీలో కూడా కొన్ని బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు. సాయంత్రం 6.30 గంటల తరువాత ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఆక్యుపెన్సీ రేషియో 50 శాతం విశాఖ రీజియన్‌లో 740 బస్సులు ఉండగా వర్షం కారణంగా అందులో 230 బస్సులను బుధవారం అధికారులు రద్దు చేశారు. ఇక మిగిలిన 510 బస్సులను ఉదయం 6.00 నుంచి రాత్రి 8.30 గంటల వరకు నడిపారు. అయినా సగటు ఆక్యుపెన్సీ రేషియో 50 శాతంగా నమోదయ్యింది.

Updated Date - Oct 30 , 2025 | 01:00 AM