Share News

తేనెటీగల దాడిలో 23 మందికి గాయాలు

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:46 PM

తేనెటీగల దాడిలో 23 మంది గిరిజనులకు గాయాలైన ఘటన మండలం జిరుగులపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి. రూడకోట గ్రామంలో గంగమ్మ తల్లికి జిరుగులపుట్టుకు చెందిన గ్రామస్థులు మూడేళ్లకోసారి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ సమీపంలో ఉన్న గ్రామ దేవత రచ్చబండ వద్ద వంటలు చేసుకోవడం ఆనవాయితీ.

తేనెటీగల దాడిలో 23 మందికి గాయాలు
రూడకోట పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న గిరిజనులు

పెదబయలు, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): తేనెటీగల దాడిలో 23 మంది గిరిజనులకు గాయాలైన ఘటన మండలం జిరుగులపుట్టు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలివి. రూడకోట గ్రామంలో గంగమ్మ తల్లికి జిరుగులపుట్టుకు చెందిన గ్రామస్థులు మూడేళ్లకోసారి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ సమీపంలో ఉన్న గ్రామ దేవత రచ్చబండ వద్ద వంటలు చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో మంగళవారం గంగమ్మతల్లికి పూజలు నిర్వహించి గ్రామస్థులంతా వంటలు చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో జిరుగులపుట్టు, సరియాపల్లి గ్రామాలకు చెందిన 23 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన రూడకోట పీహెచ్‌సీకి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యాధికారి కిశోర్‌ తెలిపారు.

Updated Date - Apr 29 , 2025 | 11:46 PM