Share News

15 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:39 AM

మునిసిపాలిటీలోని తెరువుపల్లి సమీపంలో గురువారం వ్యాన్‌లో తరలిస్తున్న 15 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

15 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత
పోలీసులు సీజ్‌ చేసిన వ్యాన్‌

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఎలమంచిలి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలోని తెరువుపల్లి సమీపంలో గురువారం వ్యాన్‌లో తరలిస్తున్న 15 టన్నుల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి రూరల్‌ ఎస్‌ఐ ఉపేంద్ర తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. తెరువుపల్లి నుంచి 15 టన్నుల రేషన్‌ బియ్యంతో వ్యాన్‌ బయలుదేరింది. పోలీసులకు సమాచారం అందడంతో పట్టుకున్నారు. వ్యాన్‌లోని నక్కపల్లి మండలం చందనాడ గ్రామానికి చెందిన బాలం కొండబాబు, ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లా జయంతగిరి గ్రామానికి చెందిన డ్రైవర్‌ సదారక్‌ హరిజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఈ బియ్యాన్ని కాకినాడ పోర్టుకు తరలిస్తున్నట్టు తెలిసిందని, పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వ్యాన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - Jul 11 , 2025 | 12:39 AM