140 కోట్ల మందికి జీఎస్‌టీ లబ్ధి
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:13 AM
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమలు కానున్న కొత్త జీఎస్‌టీ విధానం వల్ల 140 కోట్ల మందికి ప్రయో జనం చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్
రామ్‌నగర్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమలు కానున్న కొత్త జీఎస్‌టీ విధానం వల్ల 140 కోట్ల మందికి ప్రయో జనం చేకూరుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. శనివారం రామ్‌నగర్‌లోని హోటల్ రాక్‌డేల్‌లో నెక్ట్స్ జనరేషన్ జీఎస్‌టీ సంస్క రణలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో సరళీకృత పన్ను విధానాన్ని కేంద్రం అమలు చేస్తుందన్నారు. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం వైపు వెళుతున్న దని, అయితే ఎన్‌డీఏ ప్రభుత్వం తీసుకువస్తున్న ఆర్థిక సంస్కరణలతో మనదేశం మాత్రం అభివృద్ధి పథంలో దూసుకువెళుతోందన్నారు. అన్ని రంగాల్లోనూ అత్యు న్నత ప్రతిభ చూపుతూ ప్రపంచ దేశాలకు ఎగు మతులు చేసే స్థాయికి ఎదిగామన్నారు. జీఎస్‌టీ స్లాబుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, నాయకులు సురేంద్రమోహన్, నాగేంద్ర, సుహాసిని ఆనంద్, ఉమ్మడి సుజాత, తదితరులు పాల్గొన్నారు.