Share News

13మందికి తీవ్రగాయాలు

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:50 AM

జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. వీరిలో 13 మందికి తీవ్రగాయాలు కాగా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. విశాఖపట్నం పోర్టు నుంచి సిద్ధిపేటకు పప్పుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద పలు వాహనాలపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల అచ్చియ్యయుడు, శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చెల్లయ్యవలస గ్రామానికి చెందిన వై.ఎర్పప్పడు మృతిచెందారు.

13మందికి తీవ్రగాయాలు
లారీ దూసుకెళ్లడంతో నుజ్జుయిన కారు. పచ్చికూర గాంధీ, కొణతాల అచ్చియ్యనాయుడు ఇందులో ప్రయాణిస్తూ మృత్యువాతపడ్డారు.

లంకెలపాలెం వద్ద ప్రమాదంలో మొత్తం 17 మంది క్షతగాత్రులు

అనకాపల్లి, విశాఖపట్నం అస్పత్రుల్లో చికిత్స

ప్రమాద స్థలిని, లారీని పరిశీలించిన డీటీవో

లంకెలపాలెం/అనకాపల్లి రూరల్‌ జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి) : జాతీయ రహదారి లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి లారీ బీభత్సం సృష్టించిన ఘటనలో 17 మంది గాయపడ్డారు. వీరిలో 13 మందికి తీవ్రగాయాలు కాగా నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. విశాఖపట్నం పోర్టు నుంచి సిద్ధిపేటకు పప్పుల లోడుతో వెళుతున్న లారీ అదుపుతప్పి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద పలు వాహనాలపైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అనకాపల్లి మండలం రేబాకకు చెందిన పచ్చికూర గాంధీ, అనకాపల్లి గవరపాలేనికి చెందిన కొణతాల అచ్చియ్యయుడు, శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం చెల్లయ్యవలస గ్రామానికి చెందిన వై.ఎర్పప్పడు మృతిచెందారు. మంగళవారం అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్షతగాత్రులను తొలుత అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రి, అగనంపూడి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కంటైనర్‌ లారీ డ్రైవర్‌ అప్పలరాజు, రోలుగుంట మండలం నిండుగొండ గ్రామానికి చెందిన గిరిధర్‌, అడిగర్ల సత్తిబాబు అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో, తీవ్రంగా గాయపడిన కొణతాల మహాలక్ష్మినాయుడు, కె.అప్పాజీ అనకాపల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం అప్పాజీని విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు వైద్యులు తెలిపారు. అగనంపూడి ఆస్పత్రిలో చికిత్స అనంతరం డి.దుర్గారావు, సీహెచ్‌.మధుబాబు, కేఎంనాయుడు, టి.శేఖర్‌, పి.సతీశ్‌లను మెరుగైన వైద్యం కోసం షీలానగర్‌ నగర్‌లో ఒక ప్రైవేటు ఆస్పత్రికి, ఎస్‌.రామ్‌కుమార్‌ను కేజీహెచ్‌కు, టి.శేషును మెడికవర్‌ ఆస్పత్రికి తరలించారు. స్వల్పగాయాలైన ఎం.రాధ, బంగారునాయుడు, విశ్వనాథరావు, వి.వరలను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ప్రమాద స్థలిని, లారీని పరిశీలించిన డీటీవో

లంకెలపాలెం కూడలిలో సోమవారం రాత్రి జరిగిన ప్రమాద స్థలిని, ప్రమాదానికి కారణమైన లారీని జిల్లా రవాణా శాఖాధికారి (డీటీవో) మనోహర్‌ మంగళవారం పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, ప్రమాదానికి కారణమైన లారీకి సంబంధించి వివరాల గురించి పరవాడ పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి తనతోపాటు ఎంవీఐ, ఏఎంవీఐలతో కూడిన బృందాన్ని ఏర్పాటు ఏర్పాటుచేస్తామని చెప్పారు. లారీ అతివేగంగా రావడం వల్ల ప్రమాదం జరిగిందా? లేక బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా? రోడ్డుకు సంబంధించిన జామెట్రీ సమస్య వల్ల ప్రమాదం జరిగిందా? అన్న కోణాల్లో ఈ బృందం అఽధ్యయనం చేస్తుందని ఆయన తెలిపారు.

Updated Date - Jun 25 , 2025 | 12:50 AM