జిల్లాలో రూ.31.7 కోట్లతో 13 వసతి గృహాలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 11:55 PM
జిల్లాలో రూ.31.7 కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 13 వసతి గృహాలకు కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌లో ఆయా నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు.
- వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
పాడేరు, జూలై 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రూ.31.7 కోట్లతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 13 వసతి గృహాలకు కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌లో ఆయా నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాలను స్థానిక అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో 100 పడకల హాస్టళ్లు 2, అలాగే 50 పడకల హాస్టళ్లు 9, డీఏ జుగా పథకంలో 100 పడకల హాస్టళ్లు 2 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి, పెదబరడ, జాజులపాలెం, బలపం, లోతుగెడ్డ, జీకేవీధి మండలం రింతాడ(బాలికలు), జీకేవీధి(బాలికలు-1), (బాలురు-1), అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గంలో ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట, ముంచంగిపుట్టు (బాలురు), పెదబయలు మండలం కొరవంగిలో, డీఏ జుగా పథకంలో డుంబ్రిగుడ మండలం అరకు, డుంబ్రిగుడ మండల కేంద్రంలో హాస్టళ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. టెండర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ ఏ.స్వామినాయుడు, డీఈవో పి.బ్రహ్మజీరావు, సర్వశిక్ష ఈఈ డీవీ నరసింహారావు, డీఈఈ వేణుగోపాల్, ఆల్టర్‌నేట్ స్కూళ్ల కో- ఆర్డినేటర్ జె.కూర్మారావు, సీఎంవో ఎంజీ.ప్రకాశ్, ఏపీవో పాత్రుడు, ఏఎస్‌వో సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.