నేటి నుంచి ఉక్కు ఉద్యోగులకు మళ్లీ 12 గంటల డ్యూటీ
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:35 AM
నేటి నుంచి ఉక్కు ఉద్యోగులకు మళ్లీ 12 గంటల డ్యూటీ
విశాఖపట్నం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి):
ఉద్యోగులు బుధవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ 12 గంటలు డ్యూటీ చేయాలని స్టీల్ ప్లాంటు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఎనిమిది గంటలే డ్యూటీ కాగా అదనంగా మరో నాలుగు గంటలు పనిచేయిస్తోంది. దీనికి అదనపు వేతనం గాని, సెలవు గాని మంజూరు చేయడం లేదు. దీనిని ఉద్యోగులు నిరసిస్తున్నారు. తమకు పైనుంచి ఆదేశాలు ఇచ్చే ఉన్నతాధికారులు కూడా వారానికి రెండు రోజులు కాకుండా ప్రతిరోజూ 12 గంటలు పనిచేయాలని డిమాండ్ చేస్తున్నారు.