12 అడుగుల నాగపాము హల్‌చల్
ABN , Publish Date - May 19 , 2025 | 11:22 PM
మండలంలోని పెదవలస పంచాయతీ రంపుల గ్రామంలోని ఓ గిరిజనుడి ఇంట్లో 12 అడుగుల నాగుపాము హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు దానిని హతమార్చారు.
హతమార్చిన స్థానికులు
గూడెంకొత్తవీధి, మే 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదవలస పంచాయతీ రంపుల గ్రామంలోని ఓ గిరిజనుడి ఇంట్లో 12 అడుగుల నాగుపాము హల్‌చల్ చేసింది. దీంతో స్థానికులు దానిని హతమార్చారు. సోమవారం మధ్యాహ్నం రాంబాబు అనే గిరిజనుడి ఇంట్లో నాగుపాము చొరబడింది. గది లోపల పడగవిప్పి బుసలు కొడుతుండడంతో కుటుంబ సభ్యులు హడలిపోయారు. స్థానికులు కర్రలతో పాముని హతమార్చడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.