లాటరీ ద్వారా 11 బార్‌లు కేటాయింపు
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:23 AM
జిల్లాలో 11 బార్‌ల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ మయూర్‌అశోక్ స్వయంగా లాటరీ తీసి ఎంపికైన వారికి బార్‌లను కేటాయించారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో 11 బార్‌ల కేటాయింపునకు గురువారం లాటరీ నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జాయింట్ కలెక్టర్ మయూర్‌అశోక్ స్వయంగా లాటరీ తీసి ఎంపికైన వారికి బార్‌లను కేటాయించారు. జిల్లాలో 121 బార్‌లు ఉండగా గత నెల 30న నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే 58 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు రావడంతో వాటికి లాటరీ నిర్వహించి కేటాయింపులు పూర్తిచేశారు. మిగిలిన 63 బార్‌లకు రెండో దశలో నోటిఫికేషన్ జారీచేయగా 11 బార్లకు మాత్రమే నాలుగేసి దరఖాస్తులు వచ్చాయి. వాటిని గురువారం లాటరీ ద్వారా కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డీసీ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.