Share News

100 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - May 11 , 2025 | 12:56 AM

మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్‌ వద్ద శనివారం సాయంత్రం పోలీసులు వంద కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టుచేశారు. ఎస్‌ఐ జె.రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. ఒడిశా వైపు నుంచి ముంచంగిపుట్టు మండలం మీదుగా గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కుజభంగి జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కొద్దిసేపటి తరువాత ఒడిశా వైపు నుంచి వస్తున్న ఇనోవా కారును కొంతదూరంలో ఆపి, అందులో వున్న వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ముగ్గురిని పట్టుకున్నారు. ఇద్దరు పరారయ్యారు.

100 కిలోల గంజాయి పట్టివేత

ముగ్గురి అరెస్టు, మరో ఇద్దరు పరారీ

ముంచంగిపుట్టు, మే 10 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్‌ వద్ద శనివారం సాయంత్రం పోలీసులు వంద కిలోల గంజాయి పట్టుకున్నారు. దీనికి సంబంధించి ముగ్గురిని అరెస్టుచేశారు. ఎస్‌ఐ జె.రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. ఒడిశా వైపు నుంచి ముంచంగిపుట్టు మండలం మీదుగా గంజాయి రవాణా అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కుజభంగి జంక్షన్‌ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. కొద్దిసేపటి తరువాత ఒడిశా వైపు నుంచి వస్తున్న ఇనోవా కారును కొంతదూరంలో ఆపి, అందులో వున్న వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ముగ్గురిని పట్టుకున్నారు. ఇద్దరు పరారయ్యారు. కారులో తనిఖీ చేయగా రెండు బస్తాల్లో గంజాయి లభించింది. స్టేషన్‌కు తరలించి తూకం వేసి పోలీసులు వంద కిలోల గంజాయి వున్నట్టు నిర్ధారించారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన రవి మున్నాలాల్‌ జైస్వాల్‌, స్వప్నిల్‌ జయప్రకాశ్‌, అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయతీ కేంద్రానికి చెందిన కిల్లో లక్ష్మణదాసులుగా గుర్తించారు. వీరి నుంచి ఒక సెల్‌ ఫోన్‌, రూ.1,000ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన సీసా బిస్నాద్‌, కిల్లో రవికుమార్‌లను త్వరలోనే పట్టుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 11 , 2025 | 12:56 AM