Share News

డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు

ABN , Publish Date - May 24 , 2025 | 01:27 AM

స్టీల్‌ప్లాంటు రైల్వే సైడింగ్‌, దువ్వాడ స్టేషన్‌లో డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

డీఆర్‌ఎం ఆకస్మిక తనిఖీలు

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల నిరీక్షణ గదులు, ప్లాట్‌ఫామ్‌లపై పారిశుధ్యం పరిశీలన

విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు రైల్వే సైడింగ్‌, దువ్వాడ స్టేషన్‌లో డీఆర్‌ఎం లలిత్‌ బొహ్రా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి స్టీల్‌ప్లాంట్‌ రైల్వే సైడింగ్‌లో పర్యటించి భద్రతా ప్రమాణాలు, సురక్షితంగా విధుల నిర్వహణ, కార్యకలాపాలకు అవసరమైన లైటింగ్‌, ఇతర సదుపాయాలను పరిశీలించారు. కీలకమైన కార్గో నిర్వహణ ప్రాంతాల్లో భద్రతా చర్యలపై సిబ్బందితో మాట్లాడారు. శుక్రవారం ఉదయం దువ్వాడ రైల్వే స్టేషన్‌లో పర్యటించి ప్రయాణికుల నిరీక్షణ గదులు, రైల్వే కార్యాలయాలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, వాటర్‌ అవుట్‌ లెట్‌, ప్లాట్‌ఫామ్‌లపై పారిశుధ్య నిర్వహణ పరిశీలించారు. అనంతరం అమృత్‌ భారత్‌ పఽథకంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. స్టేషన్‌కు ఇరువైపులా ఉన్న సర్క్యులేటింగ్‌ ఏరియాను పరిశీలించి నిర్ణీత సమయానికి పనులు పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దువ్వాడ స్టేషన్‌ వద్ద కలిసిన జెడ్‌ఆర్‌యూసీసీ మెంబరు కె.ఈశ్వరరావు, వివిధ ఎన్జీవోల సంఘాల ప్రతినిధులు పలు సమస్యలు ప్రస్తావించగా...పరిష్కారానికి కృషిచేస్తామని డీఆర్‌ఎం హామీ ఇచ్చారు.

Updated Date - May 24 , 2025 | 01:27 AM