World Health Innovation Forum : బ్రిక్స్ ప్లస్ వర్కింగ్ గ్రూపులో విఫ్
ABN , Publish Date - Jul 10 , 2025 | 05:02 AM
ప్రతిష్ఠాత్మకమైన బ్రిక్స్ ప్లస్ మాన్యుఫాక్చరింగ్ గ్రూపునకు విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లోని వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం విఫ్ ఎంపికైంది.
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకమైన బ్రిక్స్ ప్లస్ మాన్యుఫాక్చరింగ్ గ్రూపునకు విశాఖపట్నం మెడ్‌టెక్ జోన్‌లోని ‘వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం (విఫ్)’ ఎంపికైంది. ఈ మేరకు మెడ్‌టెక్ జోన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాల మధ్య వైద్య పరికరాల తయారీలో సహకారం, పారిశ్రామిక విధానాలు రూపొందించడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది. 2026లో బ్రిక్స్ కార్యకలాపాలకు భారత్ అధ్యక్షత వహించనున్న సమయంలో ఈ అవకాశం రావడం విశేషమని మెడ్‌టెక్ జోన్ సీఈవో జితేంద్రశర్మ హర్షం వ్యక్తంచేశారు. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్న దేశంగానే కాకుండా ఆరోగ్య సంరక్షణకు పరిష్కారాలు సూచించే కేంద్రంగాను గుర్తింపు లభించిందన్నారు.