Vizag Steel Workers: ఉక్కు దీక్షా శిబిరం పోలీసుల స్వాధీనం
ABN , Publish Date - Jun 10 , 2025 | 04:01 AM
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు దీక్షలు చేస్తున్న శిబిరాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు దీక్షలు చేస్తున్న శిబిరాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించిన మరుసటి రోజు నుంచి కూర్మన్నపాలెంలోని స్టీల్ ప్లాంటు వద్ద 1,579 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తున్నారు. ప్లాంటును పూర్తిస్థాయి సామర్థ్యంతో నడపాలని యాజమాన్యం ప్రయత్నిస్తున్న తరుణంలో కార్మికులు సహకరించకుండా ఇంకా ఆందోళనలు చేస్తుండటంతో ప్రభుత్వం చర్యలకు దిగింది. దీక్షా శిబిరాన్ని స్వాధీనం చేసుకుంది. దీనిని నిరసిస్తూ కార్మిక సంఘాల నాయకులు శిబిరం బయట కూర్చొని ఆందోళన కొనసాగించారు.
- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి