Village Revenue Officers: క్లస్టర్ విధానంతో వీఆర్వోలకు పని ఒత్తిడి: రవీంద్రరాజు
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:47 AM
గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్‌తో వీఆర్వోలకు పని ఒత్తిడి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు కల్పించాలనీ, ఐవీఆర్‌ఎస్ సర్వే తక్షణమే ఉపసంహరించాలనీ డిమాండ్ చేసింది.
విజయవాడ (గాంధీనగర్), ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ పేరుతో జరుగుతున్న క్లస్టర్ విధానంతో వీఆర్వోలకు తీవ్ర పని ఒత్తిడి పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బీహెచ్.రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హులైన గ్రామ రెవెన్యూ అధికారులకు సీనియర్ అసిస్టెంట్లుగా, గ్రేడ్-2 వీఆర్వోలకు గ్రేడ్-1 వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఐవీఆర్‌ఎస్ సర్వే పేరుతో వీఆర్‌ఓల మనోభావాలు దెబ్బతీనేలా చేస్తున్న చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..