Share News

త్రిశంకు స్వర్గంలో ఉన్నాం

ABN , Publish Date - Jan 17 , 2025 | 04:50 AM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. గత ప్రభుత్వం ‘బిడ్డను కని గాలికి వదిలేసినటు’్ల వీరిపట్ల వ్యవహరించింది’ అని డెమోక్రాటిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌

త్రిశంకు స్వర్గంలో ఉన్నాం

‘బిడ్డను కని గాలికి వదిలేసినట్లు’ వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘ నేతల ఆవేదన

అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): ‘గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది. గత ప్రభుత్వం ‘బిడ్డను కని గాలికి వదిలేసినటు’్ల వీరిపట్ల వ్యవహరించింది’ అని డెమోక్రాటిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయిస్‌... నేతలు వ్యాఖ్యానించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో గ్రామ, వార్డు సచివాలయ శాఖ ముఖ్య కార్యదర్శిని సంఘం నేతలు కలిసి.. తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జీ జోసెఫ్‌ కిశోర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు బీ సతీశ్‌, షేక్‌ షరీఫ్‌, ప్రధాన కార్యదర్శి ఏ కిశోర్‌ మీడియాతో మాట్లాడుతూ... ‘ఐదేళ్ల సర్వీసు పూర్తయిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ సీనియర్‌ అసిస్టెంట్‌ పే స్కేల్‌ అమలు చేయాలని, శాఖాపరమైన పదోన్నతులు కల్పించాలని, అంతర జిల్లా బదిలీలకు అవకాశం కల్పించాలని కోరాం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం’ అని తెలిపారు.

Updated Date - Jan 17 , 2025 | 04:50 AM