Education Policies: పాఠశాలల బలోపేతానికి కృషి
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:44 AM
పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జీవో నం.117 ఉపసంహరణ, అనంతరం పరిణామాలు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై ఆయన చర్చించారు.

ప్రతి గ్రామంలో ఆదర్శ పాఠశాల: పాఠశాలల విద్యాశాఖ కమిషనర్
కర్నూలు ఎడ్యుకేషన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పాఠశాల కేంద్రంగా అమలవుతున్న విద్యావిధానాలు క్షేత్ర స్థాయిలో ఆచరణాత్మకంగా సత్ఫలితాలు సాధించాలని పాఠశాలల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు, ప్రధానోపాధ్యాయులకు పిలుపునిచ్చారు. శుక్రవారం కర్నూలు నగరంలోని జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జీవో నం.117 ఉపసంహరణ, అనంతరం పరిణామాలు, ప్రత్యామ్నాయ పరిస్థితులపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఆదర్శ ప్రాథమిక పాఠశాల అవసరం ఉందన్నారు. పాఠశాలల్లో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న చోట రెండు గ్రామాలకు కలిపి ఒకే చోట ప్రాథమిక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో 80 మంది విద్యార్థుల సంఖ్య తగ్గకుండా పాఠశాలను ఏర్పాటు చేసి, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చూడాలన్నారు. కర్నూలు జిల్లాలోని కొన్ని మండలాల్లో బోగస్ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంటు సంఖ్య 2వేలకు పైగానే ఉందని, ఈ విషయంలో సంబంధిత అధికారులను, పాఠశాలల ప్రధానోపాధ్యాయులపై వేటు తప్పదని కమిషనర్ హెచ్చరించారు.