Share News

Journalist: ప్రకాశం రామయ్య కన్నుమూత

ABN , Publish Date - Jun 20 , 2025 | 06:09 AM

నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ కరస్పాండెంట్‌, సీనియర్‌ జర్నలిస్టుగా సుపరిచితులైన కంచర్ల రామయ్య(76) గురువారం తుదిశ్వాస విడిచారు.

Journalist: ప్రకాశం రామయ్య కన్నుమూత

  • జర్నలిస్టుగా, ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌గా గుర్తింపు

  • రేపు పీఈసీ ప్రాంగణంలోనే అంత్యక్రియలు

కందుకూరు, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లా కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ కరస్పాండెంట్‌, సీనియర్‌ జర్నలిస్టుగా సుపరిచితులైన కంచర్ల రామయ్య(76) గురువారం తుదిశ్వాస విడిచారు. నెలరోజులుగా హైదరాబాద్‌లో చికిత్స పొందారు. ఆయన కుమారుడు కంచర్ల శ్రీకాంత్‌ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్నారు. కందుకూరు సమీప అత్తంటివారిపాలెం గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామయ్య ఓ ప్రముఖ తెలుగు దినపత్రికలో వివిధ స్థాయిలలో పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత కందుకూరులో ప్రకాశం ఇంజనీరింగ్‌ కళాశాలను నెలకొల్పి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చారు. ‘ప్రకాశం’ రామయ్యగా గుర్తింపు పొందారు. ఆయనకు భార్య, కుమారులు విజయ్‌ శ్రీనివాస్‌, శ్రీకాంత్‌ ఉన్నారు. అంత్యక్రియలు శనివారం పీఈసీ ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు, విద్యామంత్రి లోకేశ్‌తోపాటు పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 20 , 2025 | 06:09 AM