Share News

Venigalla Suryakumari: వెనిగళ్ల సూర్యకుమారికి ఘన నివాళి

ABN , Publish Date - Mar 03 , 2025 | 01:49 AM

రాష్ట్ర మంత్రి పి.నారాయణ, నగర ప్రముఖులు, విద్యావేత్తలు, బంధుమిత్రులు, గోసలైట్స్‌ సిబ్బంది తదితరులు సూర్యకుమారి చిత్రపటానికి అంజలి ఘటించారు. ఆమె ప్రేమాభిమానాలు, మంచితనాన్ని కొనియాడుతూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Venigalla Suryakumari: వెనిగళ్ల సూర్యకుమారికి ఘన నివాళి

విజయవాడ(కృష్ణలంక), మార్చి 2(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని ప్రముఖ విద్యాసంస్థ శ్రీగోసలైట్స్‌ మెడికల్‌ అకాడమీ చైర్మన్‌ వెనిగళ్ల నరేంద్రబాబు మాతృమూర్తి వెనిగళ్ల సూర్యకుమారి దశదిన కర్మను ఆదివారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో నిర్వహించారు. రాష్ట్ర మంత్రి పి.నారాయణ, నగర ప్రముఖులు, విద్యావేత్తలు, బంధుమిత్రులు, గోసలైట్స్‌ సిబ్బంది తదితరులు సూర్యకుమారి చిత్రపటానికి అంజలి ఘటించారు. ఆమె ప్రేమాభిమానాలు, మంచితనాన్ని కొనియాడుతూ ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నరేంద్రబాబు కుటుంబానికి సంతాపం తెలియజేశారు. గుంటూరు జిల్లా దోనేపూడి గ్రామంలో 1941, అక్టోబరు 10న వీరమాచనేని సత్యనారాయణ చౌదరి, మంగమ్మ దంపతులకు సూర్యకుమారి జన్మించారు. పీయూసీ ఉత్తీర్ణులైన ఆమె 1957 మే 19న వెనిగళ్ల పార్థసారధిని వివాహమాడారు. మంచికి మారుపేరుగా నిలిచి, అందరి హృదయాల్లో సుస్థిర నివాసం ఏర్పరచుకున్న వెనిగళ్ల సూర్యకుమారి చిరస్మరణీయులని ప్రముఖులు నివాళులర్పించారు.

Updated Date - Mar 03 , 2025 | 01:50 AM