Share News

Nuzvid Court Summons: 19లోగా వంశీని కోర్టులో హాజరుపరచండి

ABN , Publish Date - May 16 , 2025 | 04:56 AM

నకిలీ పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మే 19లోగా నూజివీడు కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2019లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పట్టాలు పంపిణీ చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది.

Nuzvid Court Summons: 19లోగా వంశీని కోర్టులో హాజరుపరచండి

నూజివీడు, మే 15(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 19లోగా నూజివీడు సెకండ్‌ అడిషనల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరచాలని గురువారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2019లో గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వంశీ బాపులపాడు మండలంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి నకిలీ పట్టాలు ఇచ్చారనే అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం వంశీని కస్టడీ కోరుతూ బాపులపాడు పోలీసులు గురువారం నూజివీడు కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు.

Updated Date - May 16 , 2025 | 04:57 AM