Share News

వడ్డె ఓబన్న పుస్తకావిష్కరణ

ABN , Publish Date - Jan 06 , 2025 | 12:16 AM

తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెఓబన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు.

వడ్డె ఓబన్న పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వడ్డెర సంఘం నాయకులు

కదిరి అర్బన, జనవరి 5(ఆంధ్రజ్యోతి): తొలి స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డెఓబన్న జీవిత చరిత్ర పుస్తకాన్ని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డె ఓబున్న జీవిత చరిత్రను ప్రజలకు అర్థమయ్యేలా పుస్తకాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత బత్తుల గంగరాజు, ఖాద్రీ వడ్డెర సంఘం అధ్యక్షుడు డాబా గంగయ్య, నాయకులు సైదాపురం రమణ, సంపగి గోవర్ధన, నరసింహులు, ప్రసాద్‌, త్రిలోక్‌, సీనియర్‌ పాత్రికేయుడు జయరామిరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 12:16 AM