Guntur District Jail: జైలు నుంచి కృష్ణంరాజు విడుదల
ABN , Publish Date - Jul 02 , 2025 | 04:21 AM
రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు మంగళవారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు.
గుంటూరు, జూలై 1(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రధాన నిందితుడు వాడపల్లి వెంకట రాధాకృష్ణంరాజు మంగళవారం గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు సోమవారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో పూచీకత్తులు సమర్పించి మంగళవారం రాత్రి జై లు నుంచి బయటకు వచ్చారు. అమరావతి.. వేశ్యల రాజధాని అని ఇటీవ ల సాక్షి చానల్ లైవ్ డిబేట్‌లో కృష్ణంరాజు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయ గా.. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు వాటిని ప్రోత్సహించినట్లుగా వ్యవహరించారు. ఈ వ్యాఖ్యలు దుమారం రేపడంతో.. రాజధాని ప్రాంత దళిత జేఏసీ నేత కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో కృష్ణంరాజును ప్రధాన నిందితుడు(ఏ1)గా, కొమ్మినేని శ్రీనివాసరావును ఏ2గా, సాక్షి యాజమాన్యాన్ని ఏ3గా చేర్చారు.