Labor rights: ఐక్య పోరాటాలే సమస్యల పరిష్కారానికి మార్గం
ABN , Publish Date - Nov 12 , 2025 | 04:42 AM
సివిల్ సప్లయ్స్ హమాలీల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని సివిల్ సప్లయ్స్ హమాలీ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు...
సివిల్ సప్లయ్స్ హమాలీ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు
అనంతపురం టౌన్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): సివిల్ సప్లయ్స్ హమాలీల హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని సివిల్ సప్లయ్స్ హమాలీ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. అనంతపురం నగరంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలో ఆయన ప్రసంగించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కృష్ణ అధ్యక్షత వహించారు. తొలుత అమరులకు సంతాపాన్ని ప్రకటించారు. అనంతరం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. కష్టజీవులు, శ్రామికుల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నారని, చీలిక తెచ్చి బానిసత్వంలోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. కార్మికలోకం ఐకమత్యంతో పోరాడి హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సివిల్ సప్లయ్స్ హమాలీల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.