Share News

Biodiversity Garden: విశాఖలో.. వైవిధ్యాల.. ఉద్యానవనం!

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:51 AM

విశాఖ నగరంలోని పెదవాల్తేరులోగల జీవ వైవిధ్య ఉద్యానవనంలో భిన్న జాతుల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు భిన్న ఆకృతులతో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వీటిలో అరెస్టోలోకియా రింజిన్స్‌ ప్రత్యేకతే వేరు. తీగ జాతికి చెందిన ఈ మొక్క జనవరి, ఫిబ్రవరి నెలల్లో పుష్పిస్తుంది. ఈ మొక్క పూలు బాతు ముక్కు, జేమ్స్‌ బాండ్‌ సిగార్‌ మాదిరి కనిపిస్తుండడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Biodiversity Garden: విశాఖలో.. వైవిధ్యాల.. ఉద్యానవనం!

విశాఖ నగరంలోని పెదవాల్తేరులోగల జీవ వైవిధ్య ఉద్యానవనంలో భిన్న జాతుల మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలు భిన్న ఆకృతులతో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. వీటిలో అరెస్టోలోకియా రింజిన్స్‌ ప్రత్యేకతే వేరు. తీగ జాతికి చెందిన ఈ మొక్క జనవరి, ఫిబ్రవరి నెలల్లో పుష్పిస్తుంది. ఈ మొక్క పూలు బాతు ముక్కు, జేమ్స్‌ బాండ్‌ సిగార్‌ మాదిరి కనిపిస్తుండడంతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పూలలో ఉండే చిన్నపాటి పండ్లను తినేందుకు చిన్న సైజు గబ్బిలాలు వస్తుంటాయి. ఈ పూల కోసం క్రిమ్జాన్‌రోజ్‌, కామన్‌రోజ్‌ అనే సీతాకోక చిలుకలు వస్తుంటాయి. ఈ పూలను అలంకరణకు వాడతారు. అరుదుగా కనిపించే ఈ మొక్కలను చూసేందుకు విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తుంటారని ఉద్యానవనం వ్యవస్థాపకులు ఎం.రామమూర్తి, మంగతాయి చెప్పారు.

మిక్కీమౌస్‌ ప్రత్యేకతే వేరు!

ఈ ఉద్యాన వనంలోని మిక్కీ మౌస్‌ మొక్కది మరో ప్రత్యేకత. దీని పూలు తొలుత పసుపు రంగులో ఉంటాయి. వారం రోజుల్లో ఎరుపు రంగుకు మారతాయి. తొలుత కాచే కాయలు ఆకుపచ్చగా ఉంటే వారం రోజుల్లో అవి నల్లని చెర్రీల ఆకారంలోకి మారతాయి. రెండు వారాల్లోనే ఈ మొక్క పూలు, పండ్లు రంగులు, ఆకృతులు మార్చుకోవడం, అవి కూడా మిక్కీ మౌస్‌ కార్టూన్‌ షోలో కనిపించే బొమ్మలను పోలి ఉండడంతో ఈ మొక్కకు ఆ పేరు పెట్టారు. ఈ మొక్క శాస్ర్తీయ నామం ఓక్నా సెర్రులేట. దీనిని అలంకరణకు ఉపయోగిస్తారని రామమూర్తి తెలిపారు.

- విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Lokesh : జగన్‌ సెక్యూరిటీపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విశాంత్రిలో పవన్ కళ్యాణ్.. అసలు విషయం ఇదే..

Updated Date - Feb 06 , 2025 | 04:51 AM