Share News

Unemployment: వైసీపీ చేసింది శూన్యం నిరుద్యోగ జేఏసీ

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:57 AM

గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగుల కోసం వైసీపీ చేసింది శూన్యమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Unemployment: వైసీపీ చేసింది శూన్యం నిరుద్యోగ జేఏసీ

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల పాలనలో నిరుద్యోగుల కోసం వైసీపీ చేసింది శూన్యమని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ షేక్‌ సిద్ధిక్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో చేసిందేమీ లేకపోగా ఇప్పుడు ‘యువత పోరు’ అంటూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి వైసీపీ చేయాలని నిర్ణయించిన యువత పోరు.. ఆ పార్టీ ఉనికి కోసమేనని ఎద్దేవా చేశారు. జగన్‌ హయాంలో యువతకు ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. మెగా డీఎస్సీ వేస్తామని హామీ ఇచ్చి చివరికి ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయలేదని దుయ్యబట్టారు.

Updated Date - Jun 23 , 2025 | 04:57 AM