Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:04 PM

కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. ఒకరికి తీవ్రంగా గాయాలై చైన్నైకు తర లించారు. కర్ణాటక రాష్ట్రం, రాయల్పాడు పోలీసుల తెలిపిన వివరాల మేరకు....

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మారుతీ శివకుమార్‌ - ప్రకాష్‌

ఒక్కరికి తీవ్రగాయాలు

మదనపల్లె అర్బన్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. ఒకరికి తీవ్రంగా గాయాలై చైన్నైకు తర లించారు. కర్ణాటక రాష్ట్రం, రాయల్పాడు పోలీసుల తెలిపిన వివరాల మేరకు.... తిరుపతి కట్టకిందపాలెం వాసి, తిరుపతి టౌన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ ప్రకాష్‌(55), స్థానిక అశోక్‌ నగరలోని ఆనంద్‌తో కలిసి శనివారం బెంగళూరుకు వెళ్లి వస్తుండగా కారు మోరీని ఢీకొంది. దీంతో ప్రకాష్‌ అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఇదే కారులో ఉన్న కడప వాసి మారుతీ శివకు మార్‌ (61) తీవ్రంగా గాయపడి, మదనపల్లె జిల్లా ఆస్పత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన ఆనంద్‌ను చికిత్స కోసం చైన్నైకు తరలించారు. రాయల్పాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 11:04 PM