Share News

రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , Publish Date - Jan 12 , 2025 | 11:38 PM

నంద్యాల, కర్నూలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.

   రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మాజీ జడ్పీటీసీ చాంద్‌బాషా (ఫైల్‌)గోవింద రెడ్డి (ఫైల్‌)

ఫ ఆళ్లగడ్డ, హొళగుంద మండలాల్లో ఘటనలు

ఆళ్లగడ్డ (శిరివెళ్ల)/హొళగుంద, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): నంద్యాల, కర్నూలు జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నంద్యాల జిల్లాలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ సమీపంలోని పిరమిడ్‌ ధ్యాన కేంద్రం వద్ద ఆదివారం జరిగిన రహదారి ప్రమాదంలో ఆళ్లగడ్డ మాజీ జడ్పీటీసీ, టీడీపీ నాయకుడు సుద్దపల్లె చాంద్‌బాషా దుర్మరణం చెందారు. ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఆళ్లగడ్డ మండలం కోటకందుకూరు గ్రామానికి చెందిన సుద్దపల్లె చాంద్‌బాషా పట్టణంలోని ఓ ఫంక్షన హాల్‌లో బంధువుల వివాహానికి హాజరై తన ద్విచక్రవాహనంపై స్వగ్రామమైన కోటకందుకూరుకు తిరిగి వెళ్తుండగా ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును డ్రైవర్‌ సడనగా ఎడమవైపుకు తిప్పారు. దీంతో వెనుక వస్తున్న చాంద్‌బాషా ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో చాంద్‌బాషా తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చాంద్‌బాషా తమ్ముడు మదార్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ రూరల్‌ పోలీసులు తెలిపారు.

ఫ కర్నూలు జిల్లా హొళగుంద శివారులోని మార్లమడికి వెళ్లే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాలివీ.. మండలంలోని ముద్దటామాగి గ్రామానికి చెందిన గోవింద్‌ రెడ్డి (44) ఆదివారం తెల్లవారుజామున స్వగ్రామం నుంచి హొళగుందలోని ఓ రైస్‌ మిల్లులో పని నిమిత్తం ఆటో తీసుకొని బయలుదేరారు. అయితే హొళగుంద శివారులో ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక వైపు నుంచి ఆటో ఢీకొట్టారు. గోవింద్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన భార్య సుమిత్ర, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల నరసింహులు తెలిపారు.

Updated Date - Jan 12 , 2025 | 11:38 PM