TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జులై నెల ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
ABN , Publish Date - Apr 19 , 2025 | 10:49 AM
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జులై నెలకు సంబంధించి ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాని విడుదల చేసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచే ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి.
భక్తుల కొంగు బంగారం, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. జులై నెలకు సంబంధించి సుప్రభాతం, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాని విడుదల చేసింది. ఈ ఉదయం( శనివారం) 10 గంటల నుంచే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. సేవలో పాల్గొనాలనుకునేవారు ఆన్‌లైన్ ద్వారా టిక్కెట్లు పొందొచ్చు.
ఇక, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవల జులై నెల కోటాను సోమవారం ( ఏప్రిల్ 22) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. జులై కోటాకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు ఏప్రిల్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి.
శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత దర్శనం ఆదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇవి కూడా చదవండి
Mithun Reddy SIT Inquiry: న్యాయవాదితో సిట్ విచారణకు మిథున్ రెడ్డి
JEE Main: జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు