Share News

TTD : చాగంటికి అవమానమంటూ దుష్ప్రచారం

ABN , Publish Date - Jan 30 , 2025 | 04:59 AM

ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్‌ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు

 TTD : చాగంటికి అవమానమంటూ దుష్ప్రచారం

యూట్యూబ్‌ చానళ్లపై టీటీడీ కేసు

తిరుమల, జనవరి29(ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగిందంటూ ప్రచారం చేసిన సోషల్‌ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు టీటీడీ తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న డయల్‌ న్యూస్‌, పోస్ట్‌ 360, జర్నలిస్ట్‌ వైఎన్‌ఆర్‌ చానళ్ల నిర్వాహకులపై కేసు నమోదయింది. చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటనపై టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను పదేపదే ప్రచారం చేశారని టీటీడీ పేర్కొంది. ఈమేరకు ఈ మూడు యూట్యూబ్‌ చానళ్ల ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్టేషన్‌లో కేసు నమోదు చేయడంతో పాటు ఢిల్లీ, విజయవాడల్లోని ప్రెస్‌ ఇన్ఫర్మెషన్‌ బ్యూరోకు కూడా ఫిర్యాదు చేశామని టీటీడీ తెలిపింది.


మరిన్నీ తెలుగు వార్తల కోసం..

Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే

Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్

Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు

Also Read: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం

Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ

Updated Date - Jan 30 , 2025 | 04:59 AM