Share News

Anand Mohan: టీటీడీ ట్రస్టులకు రూ.1.40 కోట్ల వితరణ

ABN , Publish Date - May 16 , 2025 | 05:35 AM

టీటీడీ వివిధ ట్రస్టులకు అమెరికాలోని బోస్టన్‌లో నివసించే భాగవతుల ఆనంద్ మోహన్ రూ.1.40 కోట్ల విరాళాన్ని అందజేశారు. విరాళాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వీకరించి, విభిన్న ట్రస్టులకు సద్వినియోగం చేయాలని అభ్యర్థించారు.

Anand Mohan: టీటీడీ ట్రస్టులకు రూ.1.40 కోట్ల వితరణ

తిరుమల, మే 15(ఆంధ్రజ్యోతి): టీటీడీలోని వివిధ ట్రస్టులకు గురువారం రూ.1.40 కోట్లు విరాళంగా అందాయి. అమెరికాలోని బోస్టన్‌లో నివాసముంటున్న భాగవతుల ఆనంద్‌ మోహన్‌ ఈ విరాళాన్ని అందజేశారు. విరాళం డీడీలను తిరుమలలో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు అందజేశారు. రూ.కోటి ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు, గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు, వేదపరిరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు, సర్వశ్రేయాస్‌ ట్రస్టుకు రూ.10 లక్షల చొప్పున వినియోగించాలని దాత కోరారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్‌ అభినందించారు.

Updated Date - May 16 , 2025 | 05:36 AM