గూగుల్‌ను కాదు.. గురువులనే నమ్ముకోండి
ABN , Publish Date - Mar 05 , 2025 | 11:44 PM
గూగుల్ కన్నా.. గురువులను నమ్ముకుంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆర్డీఓ సువర్ణ, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరక్టర్ విజయశాంతి అభిప్రాయపడ్డారు.

పుట్టపర్తిరూరల్, మార్చి 5(ఆంధ్రజ్యోతి): గూగుల్ కన్నా.. గురువులను నమ్ముకుంటేనే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆర్డీఓ సువర్ణ, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరక్టర్ విజయశాంతి అభిప్రాయపడ్డారు. బుధవారం బీడుపల్లి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన సురక్షిత ఇంటర్నెట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడారు. ఇంటర్నెట్‌ను విద్యార్థులు జ్ఞానాభివృద్ధికి మాత్రమే ఉపయోగించుకోవాలని, వేరే వాటి పట్ల ఆసక్తి చూపి భవిష్యత్తు పాడుచేసుకోవద్దని సూచించారు. సోషియల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అంతకుమునుపు విద్యార్థులు సురక్షిత ఇంటర్నెట్ దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసంక్షేమశాఖ పీడీ వరలక్ష్మి, డీఎంహెచఓ ఫైరోజ్‌బేగం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చిల్డ్రన ఆఫ్ ఇండియా ఫౌండేషన సమన్వయకర్త కొండప్ప, జిల్లా బాలల పరిరక్షణ సమితి అధికారి మహేష్, ఎనఎ్‌సఎ్‌స ప్రొగ్రాం కో-ఆర్డినేటర్ ఖాదర్, ప్రొగ్రాం ఆఫీసర్ మురళి, సోషల్ వర్కర్ ఆనంద్ ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.