మాజీ సైనికులకు సన్మానం
ABN , Publish Date - Feb 15 , 2025 | 12:24 AM
పుల్వామా ఘటనలో మరణించిన 40 మంది వీర సైనికులను స్మరిస్తూ శుక్రవారం బ్లాక్‌డేను స్థానిక సూర్యపాఠశాలలో నిర్వహించారు.

ధర్మవరం, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): పుల్వామా ఘటనలో మరణించిన 40 మంది వీర సైనికులను స్మరిస్తూ శుక్రవారం బ్లాక్‌డేను స్థానిక సూర్యపాఠశాలలో నిర్వహించారు. మాజీ సైనికులు నాగమల్లేశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామాంజనేయులును హెచఎం నరేంద్ర సన్మానించారు.
నంబులపూలకుంట: పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకుంటూ మండలంలోని గూటిబైలు గ్రామంలో శుక్రవారం నివాళ్లు అర్పించారు. ఇందులో బీజేపీ జిల్లా నాయకుడు జయరాం, వేమనారి, రామాంజులు, ఆంజనేయులు పాల్గొన్నారు.