Share News

Torrential Rain to Save Ailing Daughter: ఎండైనా, వానైనా అగచాట్లే!

ABN , Publish Date - Aug 14 , 2025 | 04:33 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామానికి చెందిన ఓ...

Torrential Rain to Save Ailing Daughter: ఎండైనా, వానైనా అగచాట్లే!

  • జోరువానలో చిన్నారిని ఎత్తుకుని నాలుగు కిలోమీటర్ల నడక

చింతపల్లి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయతీ తాటిబంద గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తెను జోరు వానలో నాలుగు కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. తాటిబంద గ్రామానికి చెందిన సిదరి సత్తిబాబు కుమార్తె లక్ష్మి (8) రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. గ్రామానికి అంబులెన్సులు, వాహనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బుధవారం మధ్యాహ్నం కుమార్తెను ఎత్తుకుని సత్తిబాబు డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రయాణమయ్యాడు. బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యులు వెంటనే నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి అం బులెన్సులో తరలించారు. చికిత్స అనంతరం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది.

Updated Date - Aug 14 , 2025 | 04:33 AM