Transport Minister : ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొద్దాం
ABN , Publish Date - Feb 07 , 2025 | 05:13 AM
‘ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిద్దాం. సంస్థ పూర్వవైభవం కోసం మనందరం కలిసి పనిచేద్దాం.. క్షేత్రస్థాయిలో పర్యటించి విలువైన సూచనలు చేయండి’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి

బోర్డు డైరెక్టర్లతో మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి
అమరావతి, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిద్దాం. సంస్థ పూర్వవైభవం కోసం మనందరం కలిసి పనిచేద్దాం.. క్షేత్రస్థాయిలో పర్యటించి విలువైన సూచనలు చేయండి’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి ఏపీఎ్‌సఆర్టీసీ డైరెక్టర్లతో అన్నారు. ఏపీఎ్‌సఆర్టీసీ పూర్తిస్థాయి పాలకమండలి ఏర్పాటైన నేపథ్యంలో డైరెక్టర్లు దొన్ను దొర (విజయనగరం), రెడ్డి అప్పలనాయుడు (విజయవాడ), సురేశ్ రెడ్డి (నెల్లూరు), పూల నాగరాజు (కడప) రవాణా మంత్రితో గురువారం సచివాలయంలో భేటీ అయ్యారు. మహిళలకు ఉచిత ప్రయాణం, సిబ్బంది ఆరోగ్య సమస్యలు, కారుణ్య నియామకాల భర్తీ తదితర అంశాలపై మంత్రితో చర్చించారు. సమస్యలు ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకుందామని, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తామని మంత్రి వారికి మాటిచ్చారు. ఏపీఎ్‌సఆర్టీసీ కొత్తగా కొనుగోలు చేయబోయే వాటిలో విద్యుత్ బస్సులకే ప్రాధాన్యం ఇద్దామని సూచించారు.