Share News

ద్రవజీవామృతం తయారీపై శిక్షణ

ABN , Publish Date - Mar 05 , 2025 | 11:45 PM

మండలంలోని ఎర్రబల్లిలో బుధవారం జనజాగృతి ఆధ్వర్యంలో రైతులకు ద్రవజీవామృతం తయారీపై శిక్షణ ఇచ్చారు.

ద్రవజీవామృతం తయారీపై శిక్షణ
శిక్షణ ఇస్తున్న సభ్యులు

తనకల్లు, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎర్రబల్లిలో బుధవారం జనజాగృతి ఆధ్వర్యంలో రైతులకు ద్రవజీవామృతం తయారీపై శిక్షణ ఇచ్చారు. దీని తయారీకి ఆవు మూత్రం, పుట్టమన్ను, పప్పుదినుసులపిండి, బెల్లం, ఆవు పేడ అవసరమని, వాటిని కలిసి మూడు రోజులపాటు మురగబెట్టాలని సూచించారు. అనంతరం సవ్యదిశలో కలియపెట్టిన తరువాత బంగారు రంగులోకి మారిన వెంటనే రైతులు తమ పొలాల్లో ఆ మిశ్రమాన్ని పిచికారి చేసుకోవచ్చని సూచించారు. ఇందులో జనజాగృతి ప్రకృతి వ్యవసాయ నిఫుణురాలు సుప్రియ, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2025 | 11:45 PM